వరంగల్, మహా ;
ఇండియన్ ఆయిల్ సంస్థ ‘ఇండేన్ ఎక్స్ట్రాలైట్ నౌ’ పేరుతో కొత్త సేవ ను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా 10 కేజీల తేలికైన కాంపోజిట్ ఎల్పీజీ సిలిండర్ను బుక్ చేసిన మూడు గంటల్లోనే ఇంటికి డెలివరీ చేస్తారు. పారదర్శక బాడీతో గ్యాస్ స్థాయిని సులభంగా తెలుసుకోవచ్చు. IndianOil ONE యాప్, వెబ్సైట్ లేదా వాట్సాప్ (7588888824) ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ సిలిండర్ తేలికగా ఉండటంతో పాటు తుప్పు పట్టదు. పట్టణ ప్రాంతాల్లోని గృహాలు, ఉద్యోగ నిపుణులు, చిన్న కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ సేవను రూపొందించారు








