Mahaa Daily Exclusive

  ప్రజాస్వామ్యం పరిరక్షణకు మార్పు అవసరం..! శ్రీరాముని నిధులకే టోకార వేసిన గనులు..-: సిపిఐ జన చైతన్య యాత్రలో దండి సురేష్..

Share

  • ప్రజాస్వామ్యం పరిరక్షణకు మార్పు అవసరం
  • శ్రీరాముని నిధులకే టోకార వేసిన గనులు
  • సిపిఐ జన చైతన్య యాత్రలో దండి సురేష్

కారేపల్లి, మహ: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాద అంచున ఉందని ప్రజాస్వామ్య పరిరక్షణకు మార్పు అత్యవసరమని సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తెలిపారు ప్రజలను చైతన్యవంతం చేసేందుకే మార్పు కోరుతూ గ్రామ గ్రామాన సిపిఐ జన చైతన్యా యాత్ర చేపట్టిందని ఆయన తెలిపారు సోమవారం సిపిఐ జన చైతన్య యాత్ర సింగరేణి మండల పరిధిలోని పలు గ్రామాల్లో జరిగింది ఈ సందర్భంగా మాదారం కారేపల్లి కారేపల్లి క్రాస్ రోడ్ లో జరిగిన సభలో సురేష్ మాట్లాడుతూ ఏ హామీలు ఇచ్చి మోడీ 12 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చారో కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు హామీలు అమలు చేయకపోగా ప్రజలను ఇబ్బంది పెడుతూ బతకలేని స్థితికి నెట్టి వేశారని సురేష్ తెలిపారు రైతాంగం ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచక పోగా వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టివేశారని రసానిక ఎరువులు పురుగు మందులు ధరలను ఐదు సంవత్సరాల్లోనే రెట్టింపు చేశారన్నారు లక్షల కోట్లు కార్పొరేట్ అధిపతులకు అప్పులను రద్దు చేసిన మోడీ సర్కార్ రైతంగానికి చెందిన నయా పైసా అప్పులను కూడా రద్దు చేయలేదని ఇది మోడీ కార్పొరేట్ ప్రేమకు రైతుల పట్ల వివక్షతకు నిదర్శనమని అన్నారు జయరామంటూ రామనామాన్ని జపిస్తూ రాముడి నిధులకే టోపీ పెట్టారని అయోధ్య రామాలయంలో నిధులను కాజేసిన వ్యక్తులపై చర్యలకు సిపిఐ డిమాండ్ చేస్తుందన్నారు మోడీ విధానాలు సంపూర్ణల వర్గాలకు వరంగా మారుతున్నాయని అందుకే కార్పొరేట్లను మోడీ పాలనను కోరుకుంటున్నారని సురేష్ తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వందలాది హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఉచిత బస్సు సన్నబియ్యం తప్ప ఏ హామీలను నెరవేర్చలేదని మిగిలిన హామీలు అమ్ములు గురించి కనీసం పట్టించుకోవడంలేదని సురేష్ తెలిపారు రుణమాఫీలో ఘోరంగా విఫలమైందని 50% రుణమాఫీ సక్రమ పద్ధతిలో జరగలేదన్నారు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు రుణమాఫీ పై వివిధ సందర్భాలు ఇచ్చిన హామీల హామీపై ఎప్పుడూ స్పందించడం లేదన్నారు నిరక్షరాస్యులు అయిన రైతల పట్ల యూరియా యాప్ శాపంగా మారిందని బహిరంగంగా మార్కెట్లో ఎరువులు అందుబాటులో ఉంచాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది అన్నారు ప్రభుత్వ శాఖలలో లోపించిన జవాబిదరితనం పైన మంత్రుల స్పందించాలని ప్రభుత్వ కార్యాలయాలకు సామాన్యుడు వెళ్లే పరిస్థితి లేదన్నారు అనేక చారిత్రిక పోరాటాలతో హక్కులను పథకాలను సక్రమంగా సాధించిందని సిపిఐ ఎప్పుడు ఎన్నికల సందర్భంగా మోడీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తుందని తగు రీతులో స్పందించకపోతే పోరాటాలు ప్రజా అగ్రహాన్ని ఎదురుకొక తప్పదని సురేష్ వివరించారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి రాష్ట్ర సమితి సభ్యులు యార్రబాబు ఏపూరి లతా తదితరులు ప్రసంగించగా జిల్లా కార్యవర్గ సభ్యులు అజ్మీర్ రామ్మూర్తి రావి శివరామకృష్ణ పోటు కళావతి సిహెచ్ సీతామహాలక్ష్మి యంగళ అనందరావు జిల్లా నాయకులు శ్రావణ్ తాటి నిర్మల పుచ్చకాయల వెంకటేశ్వర్లు తాతా వెంకటేశ్వర్లు వీరు నాయక్ ఉంగరాల సుధాకర్ రావు చెన్నం శెట్టి భూసయ్య దల్ సింగ్ పుచ్చకాయల శ్రీను బట్టు సంగయ్య బొమ్మల కృష్ణ రాయల రామారావు అమ్మర్ జానీ తదితరులు పాల్గొనగా మాదారం మాజీ సర్పంచ్ పలువురు కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు

Latest