- ప్రజా భవనంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే రంగారెడ్డి
- మహనీయుల సేవలు చిరస్మరణీయం
- మనం స్వేచ్ఛగా ఉన్నామంటే వారి త్యాగఫలమే
- స్వాతంత్ర సమరయోధుల సేవలను కొనియాడిన ఎమ్మెల్యే రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం ఆగస్టు 15 మహా:
ఆగస్టు 15 భారతదేశ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం ప్రజా భవన్ లో స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ప్రజా భవనంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకలకు హాజరైన స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఆయన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. నాడు దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడిన స్వాతంత్ర సమరయోధులను వారు చేసిన త్యాగాలను ఎమ్మెల్యే కొనియాడారు. నేడు దేశంలో స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి కారణం నాటి మహనీయుల త్యాగఫలమే నిదర్శనమని పేర్కొన్నారు. వారి సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే అన్నారు. నేటి యువత వారి ఆశయాలను సేవలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువతలో మార్పు రావాలని అప్పుడే దేశ గౌరవం కుటుంబ గౌరవం పెరుగుతుందని దేశాభివృద్ధిలో యువత యొక్క ప్రాధాన్యత ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. మహనీయుల బాటలో నడుస్తూ దేశ పౌరులమైన మనమందరం దేశ గౌరవాన్ని కాపాడాలని అన్నారు.. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథరెడ్డి రంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ వై సుదర్శన్ ఎస్సై చందర్ సింగ్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌస్ పాషా, కౌన్సిలర్లు, ఏఎంసి వైస్ చైర్మన్, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








