Mahaa Daily Exclusive

  అధికారులు బాధ్యతా యుతంగా పనిచేయాలి…

Share

  • అధికారులు బాధ్యతా యుతంగా పనిచేయాలి
  • బల్దియా ప్రత్యేక అధికారి/ హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
  • బల్దియా ప్రధాన కార్యాలయంలో జెండాను ఎగురవేసిన స్పెషల్ ఆఫీసర్
  • ఉత్తమ సేవలు అందించిన అధికారులు సిబ్బందికి ప్రశంసా పత్రాల అందజేత

    వరంగల్, కార్పొరేషన్ మహా ;

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది బాధ్యతా యుతంగా పనిచేయాలని బల్దియా ప్రత్యేక అధికారి/ హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అభిప్రాయపడ్డారు.
శనివారం 80 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రత్యేక అధికారి హోదా లో ముఖ్య అతిథిగా హాజరై కమిషనర్ టి.వెంకన్న తో కలసి జాతీయ జెండా ను ఎగురవేసి, వందనం సమర్పించి, జాతీయ గేయం తో పాటు రాష్ట్ర అవతరణ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన సమావేశం లో ప్రత్యేకాధికారి/ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారు చూపిన దేశభక్తి, సేవా స్ఫూర్తిని మన జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో జిడబ్ల్యూఎంసీ ను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు.
“స్వాతంత్ర్యం మనకు అందించిన హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తుంచుకుని.. పరిశుభ్రమైన, సురక్షితమైన, అభివృద్ధి చెందిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
అనంతరం ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులు సిబ్బందికి ప్రత్యేకాధికారి,కమిషనర్ లు సంయుక్తం గా ప్రశంసా పత్రాలను అందజేశారు.
హన్మకొండ జిల్లా తరపున జీడబ్ల్యూ ఎం సి పరిధి కి సంబంధించి అదనపు కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, డిప్యూటీ ఇంజనీర్ రోజా రాణి శానిటరీ ఇన్స్పెక్టర్ సి హెచ్ రాజు లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు స్వీకరించారు. వరంగల్ జిల్లా తరపున జీడబ్ల్యూ ఎం సి కి చెందిన శానిటరీ సూపర్ వైజర్ గోల్కొండ శ్రీనివాస్ ఉత్తమ ఉద్యోగి గా ఎంపికై మంత్రి సురేఖ చేతుల మీదుగా ప్రశంసా పత్రం స్వీకరించారు.
ఈ కార్యక్రమం లో అదనపు కమిషనర్ జోనా,సూపరింటెండెంట్ రాజ్ కుమార్ ముఖ్య ఆరోగ్యాధికారి డా.రాజారెడి,ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్,అకౌంట్స్ అధికారి శివ లింగం డి ఎఫ్ ఓ శంకర్ లింగం ఇంచార్జి సి హెచ్ ఓ లక్ష్మారెడ్డి డిప్యూటీ కమిషనర్ లు ప్రసన్న రాణి సమ్మయ్య బిర్రు శ్రీనివాస్ సెక్రటరీ అనిల్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Latest