Mahaa Daily Exclusive

  బీట్ ఆఫీసర్ నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది:కాంగ్రెస్ జిల్లా లీడర్ గుత్తా వెంకటేశ్వరరావు

Share

కారేపల్లి, మహా: వేటగాళ్ల విద్యుత్ ఉచ్చులకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా లీడర్ గుత్తా వెంకటేశ్వరరావు అన్నారు. వెంకిట్యా తండాలోని మాజీ ఎంపీపీ దేవులానాయక్ నాయక్ ఇంటివద్ద ఆయన కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. దేవులా కుమారుడు నవీన్ మృతి తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. విధినిర్వహణలో బీట్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నవీన్ కుటుంబానికి అందించే పరిహారం విషయం పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్తానని తెలిపారు. ధైర్యంగా ఉండాలని నవీన్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. పరామర్శించిన వారిలో కాంగ్రెస్ జిల్లా నాయకులు జవ్వాజి శ్రీనివాసరావు ఉన్నారు.

Latest