Mahaa Daily Exclusive

  కీటక జనిత వ్యాధులను నివారించాలి..! ఇన్చార్జి డిఎం&హెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి..

Share

వరంగల్, మహా ;

ప్రపంచ దోమల దినోత్సవం
సందర్భంగా వరంగల్ జిల్లా ఇన్చార్జి వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బొమ్మన రాజారెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దేశాయిపేట పరిధిలోని ఎంహెచ్ నగర్ లో ఇటీవల డెంగ్యూ కేసులు నమోదైన దృష్ట్యా కీటక జనిత వ్యాధుల పట్ల స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా స్థానిక వైద్య సిబ్బంది తో పాటు మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో కాలనీలో ర్యాలీ నిర్వహించి ప్లకార్డులను ప్రదర్శించి ప్రజలకు డెంగ్యూ , మలేరియా వ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, చర్యలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డిఎం &హెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ సర్ రోనాల్డ్ రాస్ 20 ఆగస్టు 1897 వ సంవత్సరంలో ఆడ అనాఫిలిప్ దోమ ద్వారా మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుంది అని నిర్ధారించిన సందర్భంగా అతని గౌరవార్థం గత 126 సంవత్సరాలుగా ఈరోజున ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా మలేరియా అధికారి కె రజిని మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా కీటక జనిత వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం ద్వారానే వ్యాధులు నియంత్రించవచ్చు అనే నినాదం ద్వారా వ్యాధులను అరికట్టాలని అదేవిధంగా వైద్య సిబ్బంది ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి, ఆంటీ లార్వల్ ఆపరేషన్ చేపట్టాలని, ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ భరత్ కుమార్, మాజీ కార్పొరేటర్ సురేష్ జోషి, సబ్ యూనిట్ ఆఫీసర్ కుమారస్వామి, హెచ్ఈఓ సదానందం, హెల్త్ సూపర్వైజర్ మధుకర్, వైద్య సిబ్బంది కుమార స్వామి, కోర్నేల్, అమృత, అశ్విని, ఆశా కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Latest