- మూడు దశల్లో ఎన్నికలు
- ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల నిబంధన ఎత్తివేత
- సర్పంచ్ తర్వాత ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలు
- ప్రతీ మండలంలో కనీసం ఐదు ఎంపిటిసి స్థానాలు
- రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు
హైదరాబాద్, మహా
స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. సంక్రాంతి కి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వనుండగా, మూడు దశల్లో ఈ ఎన్నికలు జరపాలని ఇప్పటికే ప్రణాళిక రెడీ చేసింది. గత జనవరి 31 తో సర్పంచ్ ల పదవీకాలం ముగియగా, ప్రత్యేక అధికారి పాలనలో గ్రామపంచాయతీలున్నాయి. గ్రామపంచాయతీలకు సంబంధించి గత ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలు ఉంచగా, విడతల వారీగా బకాయిలు చెల్లించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా, మూడు దశలలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పంచాయితీ ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లలకు మంచి ఉండకూడదన్న నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయనుంది. ఈ నిబంధన పై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి బిల్లు పెట్టనున్నారు. ఎంపీటీసీ ఎన్నికలకు కూడా కసరత్తు మొదలైంది. సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ ఎన్నికలునిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. కొన్ని మండలాలకు ముగ్గురు ఎంపీటీసీలతో నే ఎంపీపీలు ఉండగా, కనీసం ఐదుగురు ఎంపీటీసీలతో ఎంపీపీలు ఉండేలా ఆయా మండలాల్లో సంఖ్య పెంపుపై కసరత్తు చేస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీ ల సంఖ్య సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గత జులై రెండు తో ఎంపీటీసీల పదవీకాలం ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు, 538 జడ్పిటిసిలు, 5,817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేయగా, డిసెంబర్ 10 కల్లా డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందజేయనుంది.
……..








