ఆదిలాబాద్ మహా : ఆధ్మాతిక గురువు బాజీరావు మార్గంలో ప్రతిఒక్కరూ నడుచుకోవాలని, ఆధ్మాత్మిక చింతనను అలవర్చుకోవాలని, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డి అన్నారు. జైనథ్ మండలంలోని బాలాపూర్ గ్రామంలో సప్తహ వేడుకలకు ఆమె హాజరయ్యారు. బాజీరావు బాబా భక్త మండలి, గ్రామస్తులు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. ముందుగా బాజీరావు బాబా చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సప్తహ వేడుకల్లో భాగస్వాములయ్యారు. భజన మండలి నిర్వాహకులతో కలిసి తాళాలు వేసి అందరినీ ఉత్సాహపరిచారు. భజన కీర్తనలు, భక్తి పాటల మధ్య ఈ వేడుకలు అత్యంత వైభవంగా, శోభాయమానంగా సాగాయి. కార్యక్రమ నిర్వాహకులు కంది మౌనా శ్రీనివాసరెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు,మాజీ సర్పంచ్ రౌత్ దామోదర్, మాజీ ఉప సర్పంచ్ చెన్న గజానన్,గ్రామస్తులు గాజుల కిష్టు, దీపక్ రౌత్, పురుషోత్తం రౌత్, శ్రీనివాస్, సంతోష్, భోయర్ వినోద్, రవీందర్, కిషన్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.