- కారులో చెలరేగిన మంటలు.. తృట్టిలో తప్పిన ప్రమాదం.!
- ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు
ఆదిభట్ల అక్టోబర్ 17 మహా:
ఆదిభట్ల స్టేషన్ పరిధిలోని బొంగులూరు ఔటర్ రింగ్రోడ్డు వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. నాగార్జునసాగర్ నుంచి వస్తున్న ఓ కారులో బొంగులూరు ఔటర్ రింగ్రోడ్డు వద్దకు రాగానే ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో కారులో మంటలు చెలరేగడాన్ని గమనించిన ప్రయాణికులు, అప్రమత్తమై వెంటనే కారు దిగడంతో వారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. అయితే, కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.








