Mahaa Daily Exclusive

  పట్టభద్రులు తమ పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలి

Share

  • ప్రముఖ న్యాయవాది నర్సింగ్ శ్రీనివాసరావు

కారేపల్లి, మహా :పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన పట్టభద్రులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని ప్రముఖ న్యాయవాది నర్సింగ్ శ్రీనివాసరావు యువతకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో కీలకమని, సమాజ అభివృద్ధికి దోహదపడే నాయకులను ఎన్నుకోవడంలో పట్టభద్రులు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకొని, రాబోయే ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత భాగస్వామ్యం కావాలని నర్సింగ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.