కారేపల్లి,మహ: విశ్వనాథపల్లి గ్రామపంచాయతీ కారేపల్లి క్రాస్రోడ్లోని గ్రామపంచాయతీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో శనివారం రాత్రి కుంకుమ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమ పూజల్లో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలు సమర్పించారు. దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. పూజల సందర్భంగా మండపం భక్తులతో సందడిగా మారింది. మహిళలు భక్తిపాటలు, అమ్మవారి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.








