Mahaa Daily Exclusive

  జాతీయ రహదారులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి…!

Share

ఏలూరు పార్లమెంటు పరిధిలో జాతీయ రహదారులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీకి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దిల్లీలోని రవాణా భవన్ లో కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మంగళవారం కలిసి వినతి పత్రాలు అందజేశారు. NH – 216A, NH – 216 H, NH – 365BG, NH – 365 BB & NH -16 పై అభివృద్ధి పనులు, సరైన రక్షణ చర్యలు కల్పించాలని కోరారు.

* NH – 216 A లోని రైల్వే ఓవర్ బ్రిడ్జి నుండి గుండుగొలను వరకు నిర్మించిన సర్వీస్ రోడ్ల వెంబడి లైటింగ్‌ను మెరుగుపరచాలని, ప్రమాదాలను నివారించడానికి పోలీసు పెట్రోలింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను పెంచాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.

* ఉంగుటూరు నియోజకవర్గంలోని గుండుగొలను, భీమడోలు, కూరెళ్లగూడెం, పూళ్ల, కైకరం, చేబ్రోలు, నారాయణపురం, ఉంగుటూరు రెండు కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్‌, సబ్ వేలను నిర్మించాలి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు..

* బ్లైండ్ స్పాట్ బాధిత గ్రామాల ప్రజలు సర్వీసు రోడ్డుతో కలిగిన ఫ్లై ఓవర్లు నిర్మించాలని, భీమడోలు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని అయ్యప్ప స్వామి గుడి వద్ద ఉన్న పుంతకు మార్చాలని, సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని ప్రజలు తనకు చేసిన విజ్ఞప్తులను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మంత్రికి వివరించారు..

* ఏడు బ్లైండ్ స్పాట్ వద్ద ఫ్లై ఓవర్లు లేదా సబ్‌వేల నిర్మాణం కోసం అంచనాలను సిద్ధం చేయడానికి సంబంధిత అధికారులను ఆదేశించాలని ఎంపీ కోరారు.

* తన విజ్ఞప్తులకు కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ స్పందించి అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.

* ఏలూరు జిల్లా కొత్తగూడెం, దెందులూరు మండలం సీతంపేట లో 2020-2023 మధ్యకాలంలో రోడ్డు పనులు చేపట్టినా, సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో, విద్యార్థులు, కూలీలు, 200 గ్రామాల ప్రజలు రహదారి దాటే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారని, గత రెండేళ్లలో 10 మంది మృత్యువాత పడగా 40 మంది గాయపడ్డారని, సమస్య తీవ్రతను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మంత్రికి వివరించారు.

* NH -16 సీతంపేట జంక్షన్ వద్ద 4 మీటర్ల ఎత్తు బాక్స్ కల్వర్ట్ లేదా Pup, CUP నిర్మాణం, గుండుగొలను దేవరపల్లి-కొవ్వూరు సెక్షన్‌లో విద్యార్థులు రాకపోకలు సాగించేందుకు ఓవర్‌బ్రిడ్జి మధ్య సర్వీస్‌ రోడ్డు, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మంత్రికి విన్నవించారు.

* గుండుగొలను నుండి కొవ్వూరు రోడ్డు వరకు NH-16లో అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తూ చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

– ఖమ్మం నుండి దేవరాపల్లి NH 365 BG గ్రీన్‌ఫీల్డ్ హైవే అభివృద్ధి నేపథ్యంలో CH 92+150 నుంచి 93+450 మధ్య ఉన్న పామాయిల్, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల తరలించడానికి వీలుగా కనెక్టివిటీ రహదారిని నిర్మించాలని రైతుల తరపున ఎంపీ అభ్యర్థించారు..

* ఏలూరు జిల్లా పరిధిలోని ఖమ్మం-దేవరపల్లి 365 బిజి నేషనల్ హైవే గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ వెంబడి సర్వీస్ రోడ్లు మంజూరు చేయాలని, ప్రతిపాదిత సర్వీస్ రోడ్లు నిర్మించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మంత్రికి వివరించారు.

* ఖమ్మం-దేవరపల్లి ఎక్స్‌ప్రెస్‌వే, నిర్మాణంలో ఉన్న 4-లేన్ యాక్సెస్-నియంత్రిత హైవే మరియు చింతలపూడి మండలం గురుబట్లగూడెం నుంచి రేచర్ల-గురవాయిగూడెం వరకు సర్వీస్ రోడ్లు మంజూరు చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు.

* లింగగూడెం, కమలాపురం, రాఘవాపురంలో పామాయిల్ రైతులు పండించిన పంట ఉత్పత్తులు తరలించడానికి వీలుగా కనెక్టివిటీ రోడ్డు నిర్మించాలని విన్నవించారు.

* చింతలపూడి మండలం లింగగూడెం, కమలాపురం, రాఘవాపురం గ్రామాల రైతులు సరైన అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో పామాయిల్ తోటలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు.

* జీలుగుమిల్లి నుండి కొవ్వూరు రోడ్డు వయా కన్నాపురం వరకు ప్రతిపాదిత జాతీయ రహదారి 365 BB ప్రాజెక్ట్ మొదట కన్నాపురం మీదుగా వెళ్లాల్సి ఉండగా హైవే అలైన్‌మెంట్‌ను కన్నాపురం గ్రామానికి ఆనుకుని బైపాస్ రోడ్డుగా మార్చారని, మొదట ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌ ను పరిగణనలోకి తీసుకుని కన్నాపురం మీదుగా హైవే వెళ్లేలా అనుమతించాలని ఎంపీ మంత్రికి విన్నవించారు.

* మచిలీపట్నం పోర్టుకు కార్గోను రవాణా చేసే వాహనాల వల్ల ఏర్పడే భారీ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి లక్ష్మీపురం – పెడన NH-216H రహదారిలో తుక్కులూరు- అన్నవరం మధ్యలో రహదారికి ఇరువైపులా (km 69 నుంచి km 75 వరకు ) 6 కిలో మీటర్ల మేర సర్వీస్ రోడ్డు, నూజివీడు – ఏలూరు వయా ముసునూరు రహదారిలో తుక్కులూరు( హనుమాన్ జంక్షన్ – నూజివీడు కూడలి రోడ్డు)వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని, రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కిమీ స్టోన్ నంబర్ 70.465 వద్ద ఉన్న కల్వర్ట్‌ను తక్షణమే కూల్చివేసి, కిమీ స్టోన్ నంబర్ 70.385 వద్ద కల్వర్టు నిర్మించి వరదనీటి ప్రవాహాన్ని మళ్లించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.