Mahaa Daily Exclusive

  కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ. 

Share

న్యూఢిల్లీ, మహా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు అర్ధగంటపాటు సాగిన ఈ భేటీలో ఏపీకి కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, రాష్ట్రంలోని తాజా పరిణామాలు మరియు పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం.

అలాగే, ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ‘వన్ జనపథ్‌’లో కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్లు, రైల్వేశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఇరువురు చర్చలు జరిపారు.

ఈ పర్యటనలో భాగంగా వన్ జనపథ్‌లో నిర్వహించనున్న ప్రత్యేక శుభకార్యంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఇవాళ రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి, రేపు ఆదివారం ఉదయం 11:30 గంటలకు విజయవాడకు చేరుకోనున్నారు.