Mahaa Daily Exclusive

  కేసీఆర్ పై కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తారా..

Share

  • అధికారం ఎవరికీ శాశ్వతం కాదు
  • మీడియా సమావేశంలో కేటీఆర్ మండిపాటు

 

హైదరాబాద్, మహా

 

కేసీఆర్ పై కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. మూర్తీభవించిన స్త్రీగా తెలంగాణ తల్లిని కేసీఆర్ రూపొందించారన్నారు. కేసీఆర్ చేసిన అద్భుతమైన పనుల గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. ఇందిరాగాంధీ ప్రతిష్ఠించిన భరతమాత రూపాన్ని వాజ్‌పేయీ అధికారంలోకి రాగానే మార్చలేదని చెప్పారు. అలాగే దేశంలో అధికార మార్పిడి జరిగినా ఇలాంటి పనులు ఎవరు చేయలేదని, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి తెలుగుతల్లి విగ్రహ రూపం మారుస్తున్నారని మండిపడ్డారు. ‘కన్నడమాత విగ్రహం రూపు మారలేదు. కానీ, ఈ ముఖ్యమంత్రి.. కేసీఆర్‌ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నాలుగేళ్ల తర్వాత రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టిన స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం. అధికారం ఉందని సాయుధ బలగాల నడుమ మీ నాటకాలు కొంతకాలం సాగుతాయి. కానీ, ఎల్లకాలం ఇదే పరిస్థితి ఉండదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest