- ఎయిమ్స్‌లో చేరిన జగదీప్ ధన్ ఖడ్ .
- వాకింగ్ చేస్తూ స్పృహతప్పిన మాజీ ఉపరాష్ట్రపతి
- వైద్యుల పర్యవేక్షణలో చికిత్స
న్యూఢిల్లీ, మహా : మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ బుధవారం ఉదయం వాకింగ్ చేస్తూ అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. దీంతో ఆయన వెంట ఉన్న భద్రతా సిబ్బంది తొలుత ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం వైద్య బృందం ప్రాథమిక చికిత్స అందించింది. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అంబులెన్స్‌లో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. 75 ఏళ్ల ధన్‌ఖడ్‌ను ఎయిమ్స్‌లోని కార్డియో-న్యూరో సెంటర్లో చేర్చారు. ప్రస్తుతం కార్డియాలజీ విభాగం వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటివరకు ఎయిమ్స్ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







