Mahaa Daily Exclusive

  గంగపుత్రులు ఐక్యంగా తమ హక్కులు సాధించుకోవాలి…..

Share

  • గంగపుత్రులు ఐక్యంగా తమ హక్కులు సాధించుకోవాలి
  • ఘనంగా సంధిరి బాలయ్య 115 వ జయంతి ఉత్సవాలు

వరంగల్,మహా ;

గంగపుత్రులు ఐక్యంగా ఉంటూ తమ హక్కులు సాధించుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ బ్రాంచ్ అధ్యక్షులు, గంగపుత్ర వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సనత్,తెలంగాణ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, వరంగల్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ అన్నారు. గంగపుత్ర జాతిపిత ఆచార్య సంధిరి బాలయ్య 115 వ జయంతి ఉత్సవాలు, ఇటీవల వివిధ రంగాల్లో ఎన్నికైన గంగపుత్ర సంఘీయుల సన్మాన కార్యక్రమం గంగా గార్డెన్ నందు ప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షులు పాక ఓంప్రకాష్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్బంగా మొదటగా సందిరి బాలయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం డాక్టర్ సనత్,డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ గంగపుత్ర సంఘీయుల సంక్షేమం కోసం తమ పూర్తి సహాయ, సహకారం అందిస్తామని తెలిపారు.ఇందుకు హెల్త్ క్యాంప్ ఏర్పాటు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. భవిష్యత్ లో గంగపుత్రులు తమ హక్కులు కాపాడుకునేందుకు కార్యాచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ ఉత్సవాల్లో డాక్టర్ సనత్ కుమార్( ఎండీ ) వరంగల్ ఐ ఎం ఎ అధ్యక్షులు గా ఎన్నికైన సందర్భంగా,డాక్టర్ ప్రవీణ్( ఎం ఎస్) స్టేట్ ప్రెసిడెంట్ హాస్పిటల్స్,కుర్న వెంకటేశ్వర్లు సీనియర్ జర్నలిస్ట్,జిల్లా ఉపాధ్యక్షులు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ వరంగల్ జిల్లా,శ్రీమతి తులసి కళ్యాణి సంఘం మహిళా జిల్లా అధ్యక్షురాలు, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మేంబర్, జనగామ జిల్లా ఇంచార్జ్, కల్లూరి పవన్ భద్రకాళి టెంపుల్ డైరెక్టర్ ను జిల్లా, నగర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.తమకు జరిగిన సన్మానం పై సన్మాన గ్రహీతలు మాట్లాడారు. ఈ కార్యక్రమం లో డైరీ మాజీ కన్వినర్ గోపు సుధాకర్, ప్రస్తుత కన్వినర్ పద్మ మహిపాల్, బైరి భాస్కర్,జిల్లా, నగర, కార్యవర్గ సభ్యులు,పురాల కార్యవర్గ సభ్యులు, ఫైనాన్స్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.