Mahaa Daily Exclusive

  తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన…

Share

  • తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన
  • ఒకేసారి 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు
  • కీలక విభాగాలకు కొత్త అధిపతులు
  • హైదరాబాద్ సీపీగా మహేశ్ మురళీధర్ భగవత్
  • జైళ్ల శాఖ డీజీగా స్వాతి లఖ్రా
  • మహిళా భద్రత డీజీపీగా సౌమ్య మిశ్రా
  • ఏసీబీ డీజీపీగా చారు సిన్హా
  • ఆర్టీసీ ఎండీగా అనిల్ కుమార్
  • పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా నాగిరెడ్డి

హైదరాబాద్, మహా : తెలంగాణ పోలీస్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో బదిలీలు, పోస్టింగులు చేపట్టింది. పోలీస్ శాఖలోని అత్యున్నత స్థాయి నుంచి ఐజీ, డీఐజీ స్థాయిల వరకు కీలక మార్పులు చేసింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ తో పాటు మహిళా భద్రత, అవినీతి నిరోధక శాఖ, జైళ్ల శాఖ, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో కొత్త అధికారులకు బాధ్యతలు అప్పగించింది. మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ జీఓ నంబర్ 1654ను సాధారణ పరిపాలన శాఖ విడుదల చేసింది.

కీలక విభాగాలు.. కొత్తగా బాధ్యతలు..

ముఖ్యమైన బదిలీలు

1. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా మహేశ్ మురళీధర్ భగవత్ (1995 బ్యాచ్) ప్రస్తుతం డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా ఉన్న ఆయనను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించారు. వీసీ సజ్జనార్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.

2. మహిళా భద్రత విభాగం డీజీపీగా డాక్టర్ సౌమ్య మిశ్రా (1994 బ్యాచ్). ప్రస్తుతం జైళ్ల శాఖ డీజీపీగా ఉన్న ఆమెను మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగాల డీజీపీగా నియమించారు. డీజీపీ ఆర్గనైజేషన్, డీజీపీ లీగల్ బాధ్యతలు కూడా అదనంగా అప్పగించారు.

3. జైళ్ల శాఖ డీజీపీగా స్వాతి లఖ్రా (1995 బ్యాచ్). డీజీపీ ఆర్గనైజేషన్, హోంగార్డ్స్ విభాగాల నుంచి జైళ్ల శాఖ డీజీపీగా బదిలీ చేశారు. డీజీపీ హోంగార్డ్స్ బాధ్యతలు అదనంగా అప్పగించారు.

4. ఏసీబీ డీజీపీగా చారు సిన్హా (1996 బ్యాచ్). ప్రస్తుతం సీఐడీ, మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా, ఏసీబీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమెకు ఏసీబీ డీజీపీగా పూర్తి బాధ్యతలు అప్పగించారు. సీఐడీ డీజీపీగా అదనపు బాధ్యతలు కొనసాగుతాయి.

5. ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ ఎండీ: డాక్టర్ అనిల్ కుమార్ (1996 బ్యాచ్). గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీపీగా ఉన్న ఆయనను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా నియమించారు.

6. తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డీజీ.. వీసీ సజ్జనార్(1996 బ్యాచ్). హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పదవి నుంచి బదిలీ చేసి అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ, అత్యవసర సేవలు, పౌర రక్షణ విభాగాల డీజీగా నియమించారు. ఎస్పీఎఫ్ డీజీ బాధ్యతలు అదనంగా అప్పగించారు.

7. పౌరసరఫరాల శాఖ కమిషనర్: వై. నాగిరెడ్డి (1997 బ్యాచ్). ఆర్టీసీ ఎండీ పదవి నుంచి బదిలీ చేసి పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. పౌరసరఫరాల సంస్థ ఎండీ, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ బాధ్యతలు కూడా అదనంగా అప్పగించారు.

8. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీపీగా విక్రమ్ సింగ్ మాన్ (1998 బ్యాచ్). ఫైర్ సర్వీసెస్ డీజీ పదవి నుంచి బదిలీ చేసి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీపీగా నియమించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీ బాధ్యతలు అదనంగా అప్పగించారు.

9. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ గా ఎం. స్టీఫెన్ రవీంద్ర (1999 బ్యాచ్). పౌరసరఫరాల శాఖ నుంచి బదిలీ చేసి తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో (టీజీ-టీమార్స్) డైరెక్టర్‌గా నియమించారు.

10. అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా అకున్ సబర్వాల్ (2001 బ్యాచ్). అదనపు డీజీపీగా నియమితులయ్యారు. కోఆర్డినేషన్, టెక్నికల్ సర్వీసెస్ (టి-స్పార్క్) బాధ్యతలు అదనంగా అప్పగించారు.

ఐజీ, డీఐజీ స్థాయిలోనూ కీలక మార్పులు

11. ఏసీబీ డైరెక్టర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి (2004 బ్యాచ్). మల్టీ జోన్-1 ఐజీ నుంచి ఏసీబీ డైరెక్టర్‌గా బదిలీ.

12. మల్టీ జోన్-1 ఐజీ కార్తికేయ (2006 బ్యాచ్). ఇంటెలిజెన్స్ ఐజీ నుంచి మల్టీ జోన్-1కు బదిలీ. ఐసీసీసీ డైరెక్టర్ బాధ్యతలు అదనంగా అప్పగించారు.

13. రైల్వేస్ ఐజీ కె. రమేష్ నాయుడు (2006 బ్యాచ్). రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ ఐజీ నుంచి రైల్వేస్ ఐజీగా నియామకం. టీజీ-టీమార్స్ డైరెక్టర్‌కు రిపోర్టు చేయనున్నారు.

14. రోడ్డు భద్రత, ట్రాఫిక్ జాయింట్ డైరెక్టర్ డి. జోయల్ డేవిస్ (2010 బ్యాచ్). హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నుంచి టీజీ-టీమార్స్‌కు బదిలీ. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ బాధ్యతలు అదనంగా కొనసాగుతాయి.

15. జోగులాంబ జోన్-7 డీఐజీ జి. చందన దీప్తి (2012 బ్యాచ్). ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ జాయింట్ కమిషనర్‌గా ఉన్న ఆమెకు జోగులాంబ జోన్-7 డీఐజీ బాధ్యతలు అదనంగా అప్పగించారు.

16. ఇంటెలిజెన్స్ డీఐజీ ఆర్. భాస్కరన్ (2012 బ్యాచ్). సీఐ సెల్ డీఐజీగా ఉన్న ఆయనకు ఇంటెలిజెన్స్ డీఐజీ బాధ్యతలు అదనంగా అప్పగించారు.

17. బాసర జోన్-2 డీఐజీ కె. నారాయణ నాయక్ (2009 బ్యాచ్). సీఐడీ, రాష్ట్ర నేర గణాంకాల విభాగం (ఎస్‌సీఆర్‌బీ) డీఐజీగా ఉన్న ఆయనకు బాసర జోన్-2 బాధ్యతలు అదనంగా అప్పగించారు.

18. డీఐజీ కోఆర్డినేషన్ ఎల్.ఎస్. చౌహాన్(2009 బ్యాచ్). బదిలీపై డీఐజీ కోఆర్డినేషన్‌గా నియమితులయ్యారు. చార్మినార్ జోన్-6 డీఐజీ బాధ్యతలు అదనంగా అప్పగించారు.

19. టీజీ-టీమార్స్ డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్) శ్రీ బాలాదేవి (ఐపీఎస్, ఎస్‌పీఎస్). పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించారు.

20. డీసీపీ, ఎస్‌ఎం అండ్ ఐటీ, హైదరాబాద్ వి. అరవిందబాబు (ఐపీఎస్, ఎస్‌పీఎస్). పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఆయనను హైదరాబాద్ నగర పోలీస్ విభాగంలో నియమించారు.

21. ఏడీజీపీ శిక్షణ సంజయ్ కుమార్ జైన్ (1997 బ్యాచ్). టీజీఎస్పీ ఏడీజీపీగా కొనసాగుతూనే ఏడీజీపీ శిక్షణ బాధ్యతలు అదనంగా నిర్వహించనున్నారు.