హనుమకొండ, మహా ;
ములుగు జిల్లా బీరెల్లి రంగాపూర్ గ్రామానికి చెందిన మోరే సౌజన్య తన వివాహ షాపింగ్ నిమిత్తం శుక్రవారం హనుమకొండకు రాగా ఆటోలో తన బ్యాగ్ మరచిపోయి హనుమకొండ పోలీసులను ఆశ్రయించగా, సీఐ శివకుమార్ వెంటనే స్పందించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సీసీ కెమెరాల ద్వారా ఆ ఆటోను గుర్తించి, తన వివాహానికి సంబంధించిన బట్టల తో పాటు వస్తువులు నగదు రూ.80 వేలతో సహా బాధితురాలికి అప్పగించారు. ఈ సందర్భంగా బాధితురాలు సంతోషం వ్యక్తం చేస్తూ సీఐ మచ్చ శివకుమార్, క్రైమ్ కానిస్టేబుల్ అశోక్, విజయకాంత్ లను అభినందించారు.








