Mahaa Daily Exclusive

  కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం..!

Share

తెలంగాణలో రాజకీయంగా ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ దాఖలుకు ఏసీబీ గవర్నర్ అనుమతి కోరింది. సీఎం రేవంత్ సైతం గవర్నర్ తో ఈ అంశం పైన చర్చలు చేసారు. గవర్నర్ అనుమతి ఇస్తే విచారణ జరుగుతుందని చెప్పారు. ఈ కేసులో అరెస్ట్ చేయాలనుకుంటే తాను సిద్దమని కేటీఆర్ స్పష్టం చేసారు. ఇప్పుడు గవర్నర్ అనుమతితో కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తోంది. అరెస్ట్ ఖాయమనే వాదన తెర మీదకు వచ్చింది.

ఈ విషయం పైన రేవంత్ సైతం క్లారిటీ ఇచ్చారు. గవర్నర్ అనుమతి ఇస్తే తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పారు. కేటీఆర్ ఈ అంశం పైన ఇప్పటికే స్పందించారు. ఈ కేసులో తాను హైదరాబాద్ బ్రాండ్ ప్రమోషన్ కోసం నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ప్రభుత్వం తనను అరెస్ట్ చేయాలని కోరుకుంటే తాను అరెస్ట్ అవ్వటానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు. అయితే, ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇవ్వటం తో కేటీఆర్ అరెస్ట్ పైన ఊహాగానాలు మొదలయ్యాయి. గవర్నర్ అనుమతితో ఏసీబీఐ కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఏసీబీ సిద్దం అవుతున్నట్లు సమాచారం.హెచ్ఎండీఏ బోర్డు అనుమతి లేకుండా రెండు విడతలుగా 46 కోట్ల రూపాయల నిధులను కేటీఆర్ విడుదల చేశారనేది ప్రధాన ఆరోపణ.

Latest