Mahaa Daily Exclusive

  కేటీఆర్‌ కు మరోసారి హైకోర్టులో ఊరట..

Share

  • మధ్యంతర బెయిల్ ను పొడిగించిన కోర్టు

హైదరాబాద్, మహా : ఫార్మూలా-ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరో రోజు మధ్యంతర బెయిల్ ను తెలంగాణ హైకోర్టు పొడిగించింది. ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారించింది. ఈ నెల 20న కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 30 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. డిసెంబర్ 27న ఈ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది. ఇవాళ ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు ఈ నెల 31 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. కేసులో కోర్టులో ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. మరో వైపు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎత్తివేయాలని కోరుతూ మరో పిటిషన్ ను వేశారు. ఈ పిటిషన్ పై కేటీఆర్ ను కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.ఈ పిటిషన్ పై విచారణను డిసెంబర్ 31కి వాయిదా వేసింది కోర్టు. ఫార్మూలా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేయకుండా ఉన్న ఆదేశాలతో విచారణకు ఆటంకం కలుగుతుందని ఆ పిటిషన్ లో ఏసీబీ తెలిపింది. ఈ కేసులో కేటీఆర్ ను విచారించాలని ఏసీబీ కోరుతోంది. ఈ దశలో ఆయనకు బెయిల్ మంజూరు చేసినా, ఆయనకు ఎలాంటి రిలీఫ్ ఇచ్చినా విచారణకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆ పిటిషన్ లో ఏసీబీ అధికారులు చెప్పారు.ఈ కారణంతో కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దనే ఆదేశాలను ఎత్తివేయాలని కోరారు.

Latest