Mahaa Daily Exclusive

  కుటుంబ పోషణలో మహిళల పాత్ర కీలకం….!

Share

ఏలూరు: కుటుంబ పోషణలో మహిళలు ప్రధాన పాత్ర వహిస్తారని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ యామిని పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఎస్.అర్.షాపింగ్ మాల్,జి.వి. మాల్ నందు నూతన సంవత్సర వేడుకలు ఏలూరు జిల్లా అధ్యక్షులు వరక శ్యామల అధ్యక్షతన జరిగాయి.ఈ సందర్భంగా మన్నవ యామిని మాట్లాడుతూ కుటుంబ పోషణలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనదని, మహిళ ఆనందంగా ఉన్న రోజు కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుందన్నారు.అందరూ నూతన సంవత్సరం రోజున ఆనందంగా ఉంటే సంవత్సరం అంతా ఆనందంగా ఉంటాం అన్న ఉద్దేశంతో ఒక పాజిటివ్ ఆలోచనలతో ఈరోజు అందరూ ఆనందంగా ఉంటారన్నారు. అదే పాజిటివ్ థింకింగ్ ని సంవత్సరం పొడవునా మనం ఉంచుకోగలిగితే ,ప్రతిరోజు న్యూ ఇయర్ గా మనం గడపవచ్చన్నారు.ఇలాంటి రోజున ఒక గొప్ప వీర మహిళల గురించి,వారి ధైర్య సాహసాల గురించి,వీరోచిత పోరాటాల గురించి మనం తెలుసుకుంటే జీవితంలో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు అలాంటి వీర మహిళలను తలుచుకుంటే మనం మన జీవితంలో ఇంకొంచెం ముందుకు సాగచ్చని మహిళలకు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఎస్.అర్.షాపింగ్ మాల్ తదనంతరం జి.వి.మాల్ నందు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కృష్ణవేణి, మాధవి,అనిత, భారతి,శివ పార్వతి, మౌనిక,జ్యోతి, అనూష 100 మంది మహిళలకు పైగా పాల్గొన్నారు.

Latest