Mahaa Daily Exclusive

  అమెరికా హౌస్ స్పీకర్‌ గా మైక్‌ జాన్సన్‌ మద్దతు తెలిపిన ఇద్దరు ప్రతిపక్ష నేతలు

Share

యూఎస్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ గా ప్రముఖ రిపబ్లికన్‌ పార్టీకి చెందిన మైక్‌ జాన్సన్‌ ఎన్నికయ్యారు. స్పీకర్‌ పదవికి శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మైక్‌ జాన్సన్‌కు 218 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. 215 ఓట్లు ఆయనకు వ్యతిరేకంగా వచ్చాయి. ఇద్దరు ప్రతిపక్ష సభ్యులు సైతం ఆయనకే ఓటు వేయడం గమనార్హం. కాగా, స్పీకర్ ఎన్నికల ప్రక్రియ దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం మైక్‌ జాన్సన్‌కే మద్దతు తెలిపారు. దీంతో ఈ ఎన్నికల్లో జాన్సన్‌ విజయం సాధించారు. ఆ తరువాత స్పీకర్‌గా మైక్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా మైక్‌ జాన్సన్‌ మాట్లాడుతూ.. స్పీకర్ గా ఎన్నికవడం తనకు జీవితంలో దక్కిన గొప్ప గౌరవమన్నారు. అమెరికా దేశ చరిత్రలో ఇది ఒక చిరస్మరణీయ సమయమన్నారు. స్పీకర్‌గా ఎన్నికైన మైక్‌ జాన్సన్‌కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Latest