సంక్రాంతి పండుగ సందర్బంగా సొంత ఊర్లకు ప్రయాణికులు బయలుదేరి వెళ్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆర్టీఏ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి 9 గంటల తర్వాత ఈ రైడ్స్ ప్రారంభించి హైదరాబాద్ నుండి ఏపీకి వెళ్ళే బస్సులను టార్గెట్ చేసి వాటి ఫిట్నెస్ చెక్ చేస్తున్నారు. నిబందనలకు విరుద్దంగా రోడ్డుపైకి వస్తున్న వెహికల్స్ ను సీజ్ చేస్తున్నారు. తిరిగి తెల్లవారుజామున 4 గంటలకు తనిఖీలు చేసి ఏపీ నుండి హైదరాబాద్ కు వచ్చే వెహికల్స్ ను సెర్చ్ చేస్తున్నారు. ఎల్బీ నగర్ చింతలకుంటలో దాడులు చేసి 21 బస్సులపై కేసు నమోదు చేసి, ఒక బస్సును సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ ఔటర్ వద్ద చేసిన తనిఖీలలో 11 బస్సులను సీజ్ చేసినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు.







