నేడు కంది శ్రీనన్న ప్రజాదర్బార్
ఆదిలాబాద్, మహా
ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ఉద్దేశ్యంతో నిర్వహించే ప్రజాదర్బార్ కార్యక్రమం బుధవారం ఆదిలాబాద్ కేఎస్ ఆర్ క్యాంప్ కార్యాలయం ప్రజాసేవాభవన్ లో జరుగుతుందని కార్యాలయ ఇన్ ఛార్జి తెలిపారు. గతంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్థానికులు తరలిరాగా, ఆదిలాబాద్ ప్రాంతంలో ఈ కార్యక్రమం ఎంతో ప్రాచుర్యం పొందింది. అందరివాడుగా, ఆప్తుడుగా రాజకీయాలకు అతీతంగా కంది శ్రీనివాసరెడ్డి చేస్తున్న సేవలకు, అండగా నిలుస్తున్న తీరుకు ప్రజలు ప్రశంసలజల్లు కురినిస్తున్నారు. ప్రజాదర్బార్ కోసం గత కొంతకాలంగా ప్రజలు ఎదురుచూస్తుండగా, బుధవారం నిర్వహిస్తున్నారు.
Post Views: 5








