Mahaa Daily Exclusive

  కాకతీయ జూలాజికల్ పార్కులో నూతన ఎంక్లోజర్స్ ప్రారంభించిన మంత్రులు కొండా , పొన్నం…!

Share

నగరంలోని కాకతీయ జూలాజికల్ పార్క్ లో నూతనంగా రెండు రాయల్ బెంగాల్ టైగర్స్ కోసం ఏర్పాటు చేసిన ఎన్ క్లోజర్ హాగ్ డీర్ బార్కింగ్ డీర్ల ఎంక్లోజర్స్ అడవి దున్నల ఎంక్లోజర్స్ ను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ తో కలిసి ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ రూపొందించిన క్యాలెండర్ ను, జంతువులను దత్తత తీసుకోవడానికి సంబంధించిన కరపత్రాన్ని, సందర్శకులు పార్క్ లో వినియోగించడానికి వీలుగా తయారు చేసిన బట్ట సంచులను విచ్చేసిన అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ (పశ్చిమ) శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డితోపాటు కార్పొరేటర్లు రావుల కోమల, మామిండ్ల రాజు, అటవీ శాఖ ఉన్నతధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest