తూర్పు నియోజకవర్గంలోని ఎంజీఎం ఎదురుగా ఉన్న ఐఎంఏ హాల్ నందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు అధ్యక్షతన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్(హైదరాబాద్) డాక్టర్ బి రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాలపై, చేయవలసిన సేవలపై, ఉద్యోగుల పాత్రపై విశ్లేషణాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ పద్మశ్రీ , డాక్టర్ రవీందర్, డాక్టర్ విజయ్ కుమార్, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ మోహన్ సింగ్, వైద్యాధికారులు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నర్సింహారెడ్డి, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, ఇన్చార్జి డీపీహెచ్ఎన్ఓ జ్ఞాన సుందరి, ఎస్ ఓ విజయలక్ష్మి, డిపీఎంవోస్, సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 56






