టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు గూడూరి శ్రీనివాస్ పిలుపు మేరకు శనివారం వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు. చేనేత కార్మికులకు వరాల జల్లు కురిపించిన నేపథ్యంలో ర్యాలీని నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. చిప్ప వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పద్మశాలిలకు ఆరాధ్య దైవమైన కొత్తవాడ మార్కండేయ ఆలయం తోరణం నుండి గోపాలస్వామి గుడి జంక్షన్ కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షులు, మాక్స్ సంఘాల అధ్యక్షులు పద్మశాలి సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం చిప్ప వెంకటేశ్వర్లు నేత మాట్లాడుతూ చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు తెలంగాణ చేనేతల పక్షాన చేతులెత్తి నమస్కరిస్తూ ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు ఆడెపు రవీందర్, చేనేత సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షులు పంతగాని శ్రీనివాస్, కొలిపాక మదనయ్య, కాంగ్రెస్ పార్టీ 23 వ డివిజన్ అధ్యక్షులు దామెర రాజ్ కమల్, కూచన ఓదెలు, ఎలుగం పెద్ద భద్రయ్య, చిన్న భద్రయ్య, బూర వేణు మాధవ్, యెలుగం సాంబయ్య, మాచబత్తుల కుమారస్వామి, ఆడెపు రవి, ఎలుగం శ్రీకాంత్, దాసరి భాస్కర్, వలుస కిరణ్, కోట మల్లయ్య, వావిలాల భిక్షపతి, కుచన సారయ్య, బొల్లు సతీష్, మండల శంకర్, బాసాని కరుణాకర్, మంత్రి కమలాకర్, దాసరి రాజశేఖర్, పిట్ట రాములు తో పాటుగా 500 మంది చేనేత కార్మికులు పాల్గొన్నారు.







