వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం 22వ డివిజన్ గ్రేటర్ లోనే ఈ డివిజన్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ప్రస్తుతం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి. గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలనే సంకల్పంతో డివిజన్లోని దాదాపు అన్ని కాలనీలలో గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి చొరవతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టు నిర్మాణాలు చక చకా పూర్తవుతున్నాయి. గత 30 సంవత్సరాల నుండి పాత కల్వర్టు కారణంగా వర్షాకాలంలో ఇండ్లలోకి నీరు చేరి సెకండ్ బ్యాంక్ కాలనీ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన కార్పొరేటర్ నూతన కల్వర్టు నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కార్పొరేటర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 53






