రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా పథకాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు జాబితా తయారీ ప్రక్రియ వేగవంతంగా చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా సంక్షేమ పథకాల అమలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమం, నిరుపేద కుటుంబాల అభివృద్ధి కోసం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల ప్యూరిఫికేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రైతు భరోసా పథకంలో అర్హులైన రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో సమీక్షించి, లబ్ధిదారుల పేర్లను జాబితాలో చేర్చాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్డీవోలు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి, డీఎస్ఓ కిష్టయ్య, గృహ నిర్మాణ, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు






