Mahaa Daily Exclusive

  ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. 14 నెలల తర్వాత షమీ రీ ఎంట్రీ….

Share

ఇంగ్లాండ్‌తో ఈ నెల 22న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ జరుగనున్నది. స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ శనివారం జట్టును ప్రకటించింది. అయితే, ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కు 14 నెలల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి అవకాశం కల్పించారు. జట్టులో సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్‌ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీశ్‌ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్) ఉన్నారు.