తిరుపతిలోని జూపార్క్ రోడ్ లో చిరుతపులి కలకలం రేగింది. ఇక్కడి సైన్స్ సెంటర్ వద్ద చిరుతపులి ఓ వ్యక్తిపై దాడి చేసింది. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చిరుత బారినపడిన వ్యక్తిని టీటీడీ ఉద్యోగి మునికుమార్ గా గుర్తించారు. అతడు బైక్ పై వెళుతుండగా చిరుత దాడి చేసినట్టు తెలిసింది. ఆధ్యాత్మిక నగరం తిరుపతి శేషాచలం అడవులను ఆనుకుని ఉన్నందున తరచూ చిరుత పులులు అక్కడ ప్రత్యక్షమవుతుంటాయి. పలుసార్లు వన్య ప్రాణులు తిరుపతిలో జనావాసాల్లోకి వచ్చిన సంఘటనలు జరిగాయి. తాజా ఘటనతో తిరుపతి ప్రజలు మరోసారి అప్రమత్తమయ్యారు. చిరుత ఆచూకి కోసం అటవీ శాఖ అధికారులు జల్లెడ పడుతున్నారు.
Post Views: 62







