Mahaa Daily Exclusive

  పదవ తరగతితో అగ్ని వీర్ ఉద్యోగాలు మొదలైన దరఖాస్తు ప్రక్రియ…!

Share

అగ్నివీర్ వాయు ఉద్యోగాల్లో చేరాలని అనుకునే వారికి ఇదే మంచి అవకాశం. దేశ వాయు సేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత ఉన్న వారు వెంటనే దీనిని సద్విని యోగం చేసుకోండి. జనవరి 7నుంచే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోండి. టెన్త్, ఇంటర్మీడియట్ 50 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల్లో చేరవచ్చు. ఆన్ లైన్ పరీక్షకు మూడు రోజుల ముందు అర్హత పరీక్ష అడ్మిట్ కార్డులు అభ్యర్థుల వ్యక్తిగత ఈ మెయిల్ కు వస్తాయి. 7 వ తేదీ నుంచి దరఖాస్తు ప్రారంభమైంది. 27 వ తేదీ సాయంత్రం గం. 5 లోగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలోనే నెలకు రూ. 40 వేల వరకు జీతం ఉంటుంది. అఫీషియల్ వెబ్ సైట్: https://agnipathvayu.cdac.in/AV/.

Latest