రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక కామెంట్స్ చేశారు. అలాగే కాంగ్రెస్‌లో చేరికలు కూడా జోరుగా ఉంటాయన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ప్రకటన ఉంటుందన్నారు. శనివారం మీడియాతో చిట్ చాట్ చేసిన మహేష్ గౌడ సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తామని ప్రకటించారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేస్తున్నామని, సంకాంత్రి తర్వాత చేరికలు ఉంటాయన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్ర పక్షాలకు మద్దతు ఇస్తామన్నారన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. ఎమ్మెల్సీ కోసం నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ, మాజీ అధికారి గంగాధర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించారు. వచ్చే 20 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని పని చేయాలని హైకమాండ్ గట్టి వార్నింగ్ ఇచ్చిందని తెలిపారు. ఈ నెల చివరి నాటికి పార్టీలో అన్ని కమిటీలను నియమిస్తామని తెలిపారు.
దానం వ్యాఖ్యలను పరిశీలిస్తాం
బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు సరైందేనని, ఈ రేస్ ద్వారా తెలంగాణ ప్రతిష్ట పెరిగిందని, ఇందులో మరో అభిప్రాయం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే
దానం నాగెందర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ఏం మాట్లాడారో తనకు తెలియదన్నారు. ఆయన వాఖ్యలు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎవరేం పని చేస్తున్నారు, ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న విషయాలన్నీ కేసీ వేణుగోపాల్ వద్ద ఉన్నాయన్నారు. 14న ఢిల్లీ కి వెళ్తున్నామని, 15న ఏఐసీసీ ఆఫీస్ ప్రారంబోత్సవంలో పాల్గొంటున్నామని చెప్పారు. పని చేసిన నాయకులకు పదవులు వస్తాయని, కార్పొరేషన్ పదవుల భర్తీ నెలఖారులో అయిపోతుందన్నారు.
గత కొద్దినెలలుగా తెలంగాణ కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్లోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంతా భావించారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ పెద్దలతో చర్చలు కూడా జరిపారు. డిసెంబర్లోనే మంత్రి వర్గ విస్తరణ ఖాయమని అప్పట్లో మంత్రులు కూడా ప్రకటనలు చేశారు.
అయితే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉండగా ఈ నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో రేవంత్ పర్యటన నేపథ్యంలో కేబినెట్ విస్తరణ మరింత ఆలస్యం కానుందని కాంగ్రెస్ వర్గాలే చెప్పుకొచ్చారు. ఇప్పుడు అనూహ్యంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్వయంగా మంత్రి వర్గ విస్తరణపై ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.







