అసాంఘిక శక్తులకు సహకరించొద్దని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. వెంకటాపురం మండలాం తిప్పాపురం గ్రామపంచాయతీ పరిధిలోని పెంక వాగులో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనుమానితులు, అపరిచితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అసాంఘిక శక్తులకు సహకరించొద్దని సూచించారు. యువకులు గంజాయికి బానిసలు కావద్దని హెచ్చరించారు. నిషేధిత గుడుంబా ఎవరూ తయారు చేయొద్దని, విక్రయించద్దన్నారు. ప్రజలకు ఏమైనా సమస్యలుంటే పోలీసుల దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తామన్నారు. గ్రామంలోని యువత చదువు, క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, వారికి వాలీబాల్ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సీఐ బండారి కుమార్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు, సీఆర్పీఎఫ్ డీఎస్పీ సతీష్, సివిల్, ఆలుబాక సీఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.







