ఏపీలో తిరుపతి సమీపంలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద ఈరోజు బుధవారం సాయంత్రం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సినీనటుడు మంచు మనోజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడి స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. మా తాత, నాయనమ్మ సమాధులను చూసేందుకు ఎవరి పర్మిషన్ కావాలి? అంటూ మనోజ్ పోలీసులను ప్రశ్నించారు. అక్కడ ఉన్న సిబ్బందిని అరేయ్ ఎలుగుబంటి గేటు తీయరా అంటూ తిట్ల దండకం అందుకున్నారు. కోర్టు ఆర్డర్ ప్రకారం యూనివర్సిటీలోకి వెళ్లేందుకు మనోజ్‌కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. మనోజ్ తీవ్ర అసహనం మనోజ్ గౌరవంగా పోలీసు అధికారులను అనుమతించాలని కోరారు. ఉన్నతాధికారులో మాట్లాడి చెబుతామని పోలీసులు ఆయనకు సమాధానమిచ్చారు. పోలీసులు యూనివర్సిటీ లోనికి అనుమతించకపోవడంతో మనోజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతరం నారావారిపల్లెకి వెళ్లి మంత్రి నారా లోకేశ్‌తో సమావేశమయ్యారు.








