Mahaa Daily Exclusive

  హైదరాబాద్ గాలి మళ్ళింది తాజా సర్వేలో కాంగ్రెస్ పికప్ సిటీలో.. పెరిగిన రేవంత్ ప్రాబల్యం….!

Share

 హైదరాబాద్ గాలి మళ్ళింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కంచుకోటగా, లోక్ సభలో కాషాయ అడ్డాగా మారిన హైదరాబాద్ సిటీ గాలి ఇపుడు మళ్ళింది. సీఎం సాబ్ కు సిటీ సీటీ కొడుతోంది. రేవంతన్న బాగానే చేస్తుండు అని మెజారిటీ ప్రజలు, ప్రధానంగా సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హామీల ఆశలు ఉన్నా.. ప్రభుత్వం ఫర్వాలేదని, పేదల కోసం సీఎం కొట్లాడుతున్నడని సామాన్యప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇంటెలిజెన్స్ నివేదికలకు తోడు తాజాగా సి-ప్యాక్, టుడే చాణక్య వంటి సంస్థలు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించాయి. ఈ సర్వేలలో కాంగ్రెస్ పార్టీ తాను బలహీనమనుకున్న కొత్తప్రాంతాల్లో పుంజుకుంది. గతంలో బలపడ్డ ప్రాంతాల్లో కొంత ఇబ్బంది పడుతోంది. ఓవరాల్ గా సీఎంకు సామాన్యప్రజలు మంచి మార్కులే వేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం కొన్నిచోట్ల నారాజ్ ఉంది. హైడ్రా తో చెరువుల కబ్జాలను అరికడుతుండడం, సామాన్యుడికి అన్యాయం జరిగితే పెద్దోళ్ళని చూడకుండా అల్లు అర్జున్ లాంటి స్టార్ ను కూడా అరెస్ట్ చేయడం, ఎలాంటి ఒత్తిళ్ళకు తలొగ్గకుండా నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం వైపు నిలబడతాడని ప్రజలు భావిస్తున్నారు.

ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే..

 – హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలపై పార్టీ థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా సర్వే నిర్వహించింది. ఇందులో పటాన్ చెరు, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తేలింది. పటాన్ చెరు నుండి మహిపాల్ రెడ్డి, శేరిలింగంపల్లి నుండి అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ నుండి ప్రకాష్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో కూడా లోక్ సభ కంటే కూడా ఇపుడు కాంగ్రెస్ బలపడింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోటీ ఉన్నా.. డేంజర్ లో లేదని అధిష్టానం భావిస్తోంది.

– జీహెచ్ ఎంసి ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ కు తాజా సర్వేలు ఊరటనిస్తున్నాయి. సిప్యాక్ సర్వేలు పటాన్ చెరు, శేరిలింగంపల్లి కాంగ్రెస్ కు, మిగతా రెండు బిఆర్ఎస్ తో పోటాపోటీ ఉన్నట్లు పేర్కొన్నాయి.

– టుడే చాణక్య సర్వేలో మూడు నియోజకవర్గాలు పటాన్ చెరు, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ కాంగ్రెస్ పరం కానున్నాయి. సిటీ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

– అసెంబ్లీ, లోక్ సభ తో పోలిస్తే ఓవరాల్ గా సిటీ వాతావరణం పూర్తిగా మారినట్లు కనబడుతోంది. బిజెపి అనూహ్యంగా డౌన్ కాగా, బిఆర్ఎస్ కూడా చాలా డౌన్ అయినట్లు సర్వేలు తెలుపుతున్నాయి.

– కేటీఆర్ పై కేసులు, బిఆర్ఎస్ నేతల నైరాశ్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టిన హైడ్రా, మూసీ ప్రక్షాళనలకు అనుకూలత పెరుగుతోంది. ప్రధానంగా మధ్యతరగతి, పేద వర్గాల్లో క్రమంగా ముఖ్యమంత్రి రేవంత్ పట్ల సానుకూలత పెరుగుతోంది. జీహెచ్ ఎంసి ఎన్నికల్లో ఇది కలిసొచ్చే అంశమే. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే అనుకూలత పెరిగే అవకాశాలున్నాయి.

Latest