Mahaa Daily Exclusive

  మత్తు పదార్థాల నిర్మూలనకు కలిసికట్టుగా పోరాడుదాం పోస్టర్ ను ఆవిష్కరించిన ఎంపీ* 

Share

డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అలాగే మత్తు పదార్థాల నిర్మూలనకు కలిసికట్టుగా పోరాడాలని వరంగల్ ఎంపీ కడియం కావ్వ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు డ్రగ్స్, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించాలనే సంకల్పంతో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్రవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. త్వరలో నిర్వహించబోయే డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను శనివారం ఎంపీ కావ్వ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీఎస్ జేయు రాష్ట్ర అధ్యక్షులు నారగౌని పురుషోత్తం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి నరేష్ , వరంగల్ జిల్లా అధ్యక్షులు కందికొండ మోహన్, ప్రధాన కార్యదర్శి కుమార్, ఉపాధ్యక్షులు కందికొండ గంగ రాజు, ఈద శ్రీనాథ్, యూనియన్ సభ్యులు శ్రీహరి, అవినాష్, తదితరులు పాల్గొన్నారు.

Latest