Mahaa Daily Exclusive

  పోలవరం: ఇసుక రేవుల్లో నిబంధనలు తప్పనిసరి…!

Share

ఇసుక రేవుల్లో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జంగారెడ్డిగూడెం ఆర్డీవో రమణ సూచించారు. పోలవరం మండలం పట్టిసీమ వద్ద మంజూరు చేసిన ఇసుక రేవును గురువారం ఆమె పరిశీలించి, బోట్మెన్ సొసైటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఆర్డీవో మాట్లాడుతూ రేవులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం
6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక తరలించాలన్నారు. పొద్దుపోయాక రేవులో లారీలు ఉండకూడదని స్పష్టం చేశారు.