Mahaa Daily Exclusive

  గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ ఆవిష్కరించిన – హోంమంత్రి వంగలపూడి అనిత.

Share

ఆంధ్రప్రదేశ్ ఎస్సీ$ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం ఆద్వర్యంలో జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో 2025-డైరీని హోంమంత్రి వంగలపూడి అనిత ఆవిష్కరణ చేశారు. డైరీని ఆవిష్కరించిన హోం మంత్రి వంగలపూడి అనిత ఈ సందర్భంగా మాట్లాడుతూ
ఐక్యతగా ఉద్యోగులు పనిచేస్తే, సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు.అంబేద్కర్ భావజాలం ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కోరారు.
ఎప్పుడు మనల్లి మనం తగ్గించుకోకూడదని సూచించారు.అందరిలాగే చదువుతున్నాం.అందరిలాగే ఉద్యోగాలు చేస్తున్నామన్నారు.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని తెలిపారు.దేశ ప్రజలు అందరి కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు.నీతి,నిజాయితీగా అధికారులు పని చేయాలన్నారు.నేను ఒక టీచర్ గా 2013 లో చంద్రబాబు దగ్గరికి వెళ్ళాను అని గుర్తుచేసుకున్నారు.
చంద్రబాబు ఏమి చదువుకున్నావు అని అడిగారని చెప్పారు.నాకు అన్ని విధాలుగా చేయూత ఇచ్చినది చంద్రబాబు నాయుడే అని గంటా పధంగా తెలియజేశారు.మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి చదువు అని ,ఆ చదువే నాకు రాజకీయాల్లో పెట్టుబడి అయిందన్నారు.ఎస్పీ,ఎస్టీ గెజిటెడ్ అధికారుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని పేర్కొన్నారు.అనంతరం హోం మంత్రిని ఎస్సీ,ఎస్టీ గెజిటెడ్ అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.