Mahaa Daily Exclusive

  సంత్ సేవాలాల్ మహారాజ్‌కు మంత్రి నారా లోకేష్ నివాళులు..,!

Share

గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ‘సేవాలాల్ మహారాజ్ సమాజ శ్రేయస్సు కోసం చూపించిన మార్గం ఆదర్శనీయం. తన పాటలు, రచనల ద్వారా ప్రజలను జాగృతం చేయడానికి అనేక ప్రబోధాలను బోధించారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారు.’ అని లోకేష్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.