Mahaa Daily Exclusive

  బాలకృష్ణను అలా పిలవడమే ఇష్టం: పవన్

Share

విజయవాడలో జరిగిన ‘యూఫోరియా మ్యూజికల్ నైట్’లో బాలకృష్ణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బాలకృష్ణ నన్ను ప్రేమగా బాలయ్య అని పిలవమంటారు. కానీ ఆయనంటే నాకు అపారమైన గౌరవం. బాలకృష్ణ సార్ అని పిలవడమే నాకు ఇష్టం. ఒకటి, రెండు కాదు ఎన్ని తరాలు వచ్చినా ప్రేక్షకులను ఆకర్షించే ఆయన నటన హర్షణీయం. సినిమాల్లోనే కాదు సేవల్లోనూ బాలయ్య ఎప్పుడూ ముందుంటారు.’ అని పవన్ అన్నారు.