Mahaa Daily Exclusive

  నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల…!

Share

మే నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను TTD ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన‌లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించి నేటి నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10గంటల వరకు భక్తులు రిజిస్టర్ చేసుకోవచ్చు. వాటి చెల్లింపులను ఈ నెల 20 నుంచి 22వ తేదీల మధ్యలో చేయాల్సి ఉంటుంది. మే నెల గదుల కోటాను టీటీడీ ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.