ఫామ్ ల్యాండ్ పేరుతో జరుగుతోన్న స్థలాల కొనుగోళ్లపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. ‘సర్కారుకు ఫీజు చెల్లింపును తప్పించుకునేందుకు కొందరు వ్యాపారులు వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారు. అలా అమ్మాలంటే గజాల్లో కాకుండా కనీసం అర్ధ ఎకరా భూమిని విక్రయించాలి. అప్పుడే రిజిస్ట్రేషన్ చేయాలని 2018లోనే ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయినా కొందరు అధికారులు పట్టించుకోవట్లేదు. అలాంటి వారిపై, సంస్థలపై చర్యలు తప్పవు’ అని హెచ్చిరంచారు.
Post Views: 104







