వల్లభనేని వంశీ ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైల్లో ములాఖత్‌లో వంశీని కలిశారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. వంశీ అరెస్ట్ లా అండ్ ఆర్డర్ ప్రకారం లేదని, తప్పుడు కేసులు పెట్టి వంశీని ఇరికించారంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ నడుస్తోందని ఆరోపించారు.
Post Views: 141







