Mahaa Daily Exclusive

  ఏపీలో వేలానికి 905 టన్నుల ఎర్రచందనం..!

Share

ఏపీ రాష్ట్రంలో 21వ విడత ఎర్రచందనం వేలానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 905.671టన్నుల ఎర్ర చందనాన్ని విక్రయించటం కోసం గ్లోబల్ ఈటెండర్లు పిలవటానికి అనుమతిచ్చింది. ఏ, బీ, సీ గ్రేడుల సరుకు మొత్తాన్ని మూడు దశల్లో వేలం వేయనుంది. ఫిబ్రవరి 28న తొలిదశ, మార్చి 6న రెండోదశ, మార్చి 13న మూడోదశ వేలం వేయనుంది. ఈమేరకు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాము ఉత్తర్వులును జారీచేశారు.