తిరుమల శ్రీవారి మెట్టుమార్గంలో మంగళవారం ఉదయం 200వ మెట్టు వద్ద ఓ భక్తుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. అతడిని హుటాహుటిన చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భక్తుడు మృతి చెందాడు. మృతుడిని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన వెంకటేశ్(50)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 125







