Mahaa Daily Exclusive

  ఇందిరమ్మ ఇండ్లకు నేడు శ్రీకారం ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి…!

Share

ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. మొదటి విడుతలో మంజూరు చేసిన 72,045 ఇండిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నారాయణపేట జిల్లా నారాయణపేట మండలము, అప్పకపల్లె లో రాష్ట్ర ముఖ్య మంత్రి పథకం ప్రారంభించనున్నారు. ఇల్లు లేని కుటుంబాలందరికీ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, లబ్దిదారులు స్వంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించింది. ఇంటికి రు.5 లక్షల పూర్తి సుబ్సిడితో ఆర్థిక సహాయం అందించనుంది. బేస్మెంట్ కట్టగానే రూ.లక్ష లబ్దిదారుని ఖాతాకి నేరుగా విడుదల కానుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ పథకంపై ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

నేడు రెండు జిల్లాలకు సీఎం

వికారాబాద్, నారాయణ పేట జిల్లాల్లో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్నాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామానికి చేరుకుంటారు. పోలేపల్లి లో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత నారాయణ పేట మండలం అప్పక్ పల్లి చేరుకుంటారు. అక్కడ జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభిస్తారు. బీపీసీఎల్ కంపెనీ సహకారంతో పూర్తిగా మహిళలచే నడిపే పెట్రోల్ బంక్ ఇది. రాష్ట్రంలోనే మొదటి సారి ఈ తరహా బంక్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం అప్పక్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నారాయణ పేట మెడికల్ కాలేజీ లో అకడమిక్ బ్లాక్ తో పాటు, ఇతర భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు గురుకుల హాస్టల్ ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.