బిజెపికి అభివృద్ధి పట్టదని, అక్షింతలు, అబద్ధాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ , మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా గురువారం మంచిర్యాల జిల్లాలో ప్రచారం నిర్వహించారు. బిజెపి కి అభివృద్ధి పట్టదు, అక్షింతలు, అబద్ధాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారని, అటు కేంద్రంలో కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప యువతకు ఉపాధి, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదన్నారు. వాస్తవాలు గ్రహించి పటబద్రులు మొదటి ప్రాధాన్య ఓటు నరేందర్ రెడ్డికి వేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ తో మాత్రమే అభివృద్ది, సంక్షేమం రెండు జోడెద్దుల బండిలా పరిపాలన సాగుతుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వెడ్బబొజ్జు, అభ్యర్ధి నరేందర్ రెడ్డి నేతలు పాల్గొన్నారు.
Post Views: 86







