పట్టభద్రుల ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని, కాంగ్రెస్ నాయకత్వం పటిష్ఠంగా ఉందని, ఐదేండ్లు అద్భుత పరిపాలన సాగిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గురువారం ఎమ్మెల్సీ అభ్యర్ధి నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన శాసనసభ ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి వలన ఎనిమిది స్థానాలు గెలుచుకున్నామని, పదేండ్లలో ఎన్ని కష్టాలు పెట్టిన కాంగ్రెస్ తోనే క్యాడర్ ఉన్నారన్నారు. ఏ అభ్యర్థికి పట్టభద్రుల సమస్యలపై అవగాహన ఉందో చూడాలని, చైతన్య,నారాయణ విద్యాసంస్థలకి ధీటుగా అల్ఫోర్స్ కళాశాల ని ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను నరేందర్ రెడ్డి అందిస్తున్నారన్నారు. నరేందర్ రెడ్డి పై బిజేపి నాయకులు దుష్ప్రాచారం చేస్తున్నారని, ఇది నరేందర్ రెడ్డి ఎన్నిక కాదు అని కాంగ్రెస్ పార్టీ ఎన్నిక అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. యాభై ఆరు వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. 317 జీవో బిఅర్ఎస్ తీసుకువస్తే బిజేపి మద్దతు తెలిపిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 317 జీవో ద్వారా అన్యాయం జరిగిన వారికి వెసులుబాటు కల్పించామన్నారు. 317 జీవో గురించి మాట్లాడే హక్కు బండిసంజయ్ కి లేదన్నారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగుల కి ఉద్యోగ కల్పన చేస్తామన్నారు.
బిజెపికి బిఆర్ఎస్ మద్దతు
బిఅర్ఎస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బిజేపి కి సపోర్ట్ చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రదాన ప్రతిపక్షం బిఅర్ఎస్. మేము బిఅర్ఎస్ తో ఎలా నడుస్తాం. గత ప్రభుత్వం చేసిన తప్పులు,లోపాలు ఖచ్చితంగా ఎత్తిచూపుతాం. బిజేపి, బిఅర్ఎస్ లు కలిసి నడుస్తున్నారు. హత్య రాజకీయాలని క్షమించేది లేదు. భూపాలపల్లి హత్య విషయం లో ప్రభుత్వం సిరియస్ గా ఉంది…ఖచ్చితంగా తప్పు చేసినవారికి శిక్ష పడుతుంది. బిఅర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం కాదు. పది సంవత్సరాల లో జరిగిన అవినీతి ని పకడ్బందీగా బయటికి తీస్తున్నాం. కమిషన్ ప్రభుత్వం ప్రమేయం లేకుండా వాళ్ళ పని వారు చేసుకుంటున్నారు. వామన్ రావు దంపతుల హత్యకేసు సుప్రీంకోర్టు లో విచారణ జరుగుతుంది. బిఆర్ఎస్ వారు భ్రమలో ఉన్నారు. మా నాయకత్వం పటిష్ఠంగా ఉంది…మాకు ఏంకాదు. మా గ్రాఫ్ ఎక్కడ పడిపోలేదు. ఐదేండ్లు మా ప్రభుత్వం కి ఢోకాలేదు. పట్టభద్రుల ఎన్నికలలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.







