ఏపీలో టమాటా ధరల పతనంపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటా కొనుగోళ్లకు ఆదేశాలు జారీ చేసింది. రైతుల దగ్గర నేటినుంచి టమాటా కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో టమాటాను రైతుల నుంచి ప్రభుత్వమే మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
Post Views: 177








